ఉమెన్స్ అండర్-19 క్రికెట్ లీగ్ లో కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి కి అభినందనలు:కోచ్ షేక్ సిద్దిఖ్
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 26:ఉమెన్స్ అండర్-19 క్రికెట్ లీగ్ కు పచ్చిపాల మహేశ్వరి ఎంపికైనట్లు కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్దిఖ్ తెలిపారు.
హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియం లో నిర్వహించిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ సెలక్షన్ లో పాల్గొని అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ కనబరచి మహేశ్వరి ఉమెన్స్ అండర్ 19 క్రికెట్ లీగ్ కు పచ్చిపాల మహేశ్వరి ఎంపికైనట్లు కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్దిఖ్ తెలిపారు.
తను ఆగస్టు 27 నుండి హైద్రాబాద్ లో జరిగే ఉమెన్స్ అండర్ 19 క్రికెట్ లీగ్ లో పాల్గొంటుంది అని తెలిపారు.
మహేశ్వరి గత 5 నెలలుగా కోదాడ క్రికెట్ అకాడమీ లో కోచ్ షేక్ సిద్ధిఖ్ వద్ద శిక్షణ తీసుకుంటుంది.
మహేశ్వరి ఎంపికైన సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్,కోదాడ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ డా, కొత్తపల్లి సురేష్,ఖజమీయ, దుర్గయ్య,సురేష్,జబ్బార్,శ్రీకాంత్ తదితరులు అభినందనలు తెలిపారు.