ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ …
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ ఆద్వర్యంలో నిర్వచించే 68 వ రాష్త్ర స్థాయి క్రికెట్ ఉండర్ 14 టోర్నమెంట్ లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ ఎంపికైనట్లు కోచ్ సిద్దిక్ తెలిపారు.
వీరు 8 నెలలుగా కోదాడ క్రికెట్ అకాడమీ లో కోచ్ షేక్ సిద్ధిఖ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.సందేశీ రిత్విక్ జయ స్కూల్ లో 9వ తరగతి,ధారావత్ ఈశ్వర్ హోల్ ఫ్యామిలీ స్కూల్ నందు 8 వ తరగతి చదువుతున్నారు.జోగులాంబ గద్వాల్ వేదికగా అక్టోబరు ది 15,16,17,18 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.వీరు ఎంపికైన సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్,కోదాడ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ డా. కొత్తపల్లి సురేష్,ఖజమీయ,దుర్గయ్య,సురేష్,జబ్బర్,నాయిని నాగేశ్వర్ రావు,శ్రీకాంత్,నాయిని వేంకటేశ్వర్లు,తదితరులు అభినందనలు తెలిపారు.