కోదాడ,మార్చి 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సురేష్ జకోటియా పేర్కొన్నారు.మహాశివరాత్రి మహిళా దినోత్సవాలను పురస్కరించుకొని వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భక్తులకు ఆమ్లా జ్యూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ సురేష్ జకోటియా.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలన్నారు.ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఆమ్లా జ్యూస్ వల్ల విటమిన్ సి లభ్యామవుతుందని మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపశమనాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఇమ్మడి అనంత చక్రవర్తి,డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర,ట్రెజరర్ గుడిగుంట్ల నాగ అఖిల్,ఓరుగంటి నిఖిల్,భరత్,ఇమ్మడి రమేష్,గరినే శ్రీధర్,వంగవీటి శ్రీనివాసరావు,దివ్వెల రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఉసిరి ఆరోగ్యానికి శ్రేష్టం.
RELATED ARTICLES



