ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//కోదాడ,మార్చి 08(ప్రతినిధి మాతంగి సురేష్):అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాదిగ ఉద్యమ సమాఖ్య,ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ అధ్యక్షులు నందిగామ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం వెంకటరమణ,ఎంఈఎఫ్ జిల్లా మహిళా నాయకురాలు ఎం రాణి,ఎస్ఎ మ్యాథ్స్ జడ్పీహెచ్ఎస్ గణపవరం నందిపాటి సుజాత,పి పద్మ,డా,నందిపాటి శ్రీ ప్రియను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నందిగామ ఆనంద్ మాట్లాడుతూ సృష్టికి మూలం ఆడవారు.ఓపికతో,సహనంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఇంటి పనులు అన్ని చక్కపెట్టుకుంటూ సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా మణులకి శుభాకాంక్షలు,ధన్యవాదాలు తెలియజేశారు.మన మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్,రమాబాయి,జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వంటి మహనీయుల బాటలో ప్రయాణిస్తూ ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో నందిపాటి సైదులు,ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పులి నరసింహారావు,ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ గౌరవాధ్యక్షులు చేకూరి రమేష్,ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు నందిపాటి రవి,టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి యలమర్తి శౌరి,మేళ్లచెరువు వీరభద్రం,మాదాసు బాబు,ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి గంధం బుచ్చారావు,ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.



