ఎంజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోటపల్లి నాగరాజు.
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 04 (ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ పట్టణానికి చెందిన తోటపల్లి నాగరాజును మాదిగ జర్నలిస్టుల ఫోరం(ఎంజెఎఫ్)జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్ మాట్లాడుతూ సుప్రీం కోర్టులో ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన మరుక్షణంమే,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అన్ని ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంజెఎఫ్ జిల్లా ప్రధాన
కార్యదర్శి తోటపల్లి నాగరాజు మాట్లాడుతూ… తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్,రాష్ట్ర నాయకులు మోలుగురి గోపి,పడిశాల రఘు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎస్సీ వర్గీకరణ అమలు పరచడమే ఎంజెఎఫ్ లక్ష్యమని ఈ నేపథ్యంలో ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగ జర్నలిస్టులు అంత ఐక్యంగా ఉండి మందకృష్ణ మాదిగ నేతృతంలో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎఫ్ జిల్లా గౌరవ సలహాదారులు బంకా వెంకట రత్నం,జిల్లా నాయకులు చెరుకుపల్లి శ్రీకాంత్,తమలపాకుల లక్ష్మీనారాయణ,చీమ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు