ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి:ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి
కోదాడ,మే 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీరా రెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఎక్కువ సాధించుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని అన్నారు.ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని గెలిపించినట్లయితే ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గంలో ఎంపీ నిధులు ఎక్కువ మొత్తంలో తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లిద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి,కూరుగుంట్ల శ్రీనివాస్ రెడ్డి,ఓరుగంటి రాధాకృష్ణారెడ్డి,నరేష్,ఎరగాని శేషు,సోనియా బహుద్దీన్,హమీద్,వెంకటాచారి,ఖమ్మం ఉపేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



