కోదాడ,నవంబర్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాబోయే ఎన్నికలలో తమ్మర బండపాలెం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ చూస్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు అన్నారు.బుధవారం తమ్మరలో గల సీతారామ ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి,మాజీ ఎమ్మెల్యే చందర్ రావులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తమ్మర కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ వంగూరి ఏసుపాదం ఆధ్వర్యంలో యూత్ నాయకులు ఎంపి ఉత్తమ్ దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామినేని ప్రమీల రమేష్ మరియు సామినేని నరేష్ ఆధ్వర్యంలో తమ్మర బండపాలెంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని వారు అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి గెలుపుకు భారీ ఎత్తున కృషి చేసి ఎక్కువ ఓట్లు పడే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో మాతంగి అశోక్ కుమార్,పెదపంగు పాపారావు,రాజారావు,వంగూరి గోపి,చిలకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని సన్మానించిన మాజీ సర్పంచ్ వంగూరి ఏసుపాదం మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు
RELATED ARTICLES



