కోదాడ,అక్టోబర్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉమ్మడి నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ నిధులతో తమ్మర బండ పాలెంలో 3వ వార్డులో సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మూడవ వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్,కనగాల రాధాకృష్ణలు పాల్గొని సీసీ రోడ్డుకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంపి ఉత్తమ కుమార్ రెడ్డి నిధులు నాలుగు లక్షల రూపాయలతో బండ పాలెం లోని మూడవ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం అభినందనీయమని వారు అన్నారు.ఈ మూడోవ వార్డు లో ఎంపీ నిధులతో మరెన్నో డ్రైనేజీలు సిసి రోడ్లుకు అనుమతులు తీసుకొస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ అసెంబ్లీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ షేక్ జానీ,షేక్ మౌలానా,షేక్ ఖాసిం,సామినేని వెంకటేశ్వర్లు,వెన్న బోయిన సురయ్య,దంతాల వెంకటేశ్వర్లు,వెన్నబోయిన వెంకటేశ్వర్లు,షేక్ జిన్ను,దంతాల చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ నిధులతో సిసి రోడ్డుకి శంకుస్థాపన చేసిన మూడవ వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్
RELATED ARTICLES



