కోదాడ,సెప్టెంబర్ 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణంలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పెయిత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో నీట్ లో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వంటేపాక జానకి యేసయ్య పాల్గొని విద్యార్థులను శాలువా బొకేతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఇటీవల ఎంబిబిఎస్ లో సంపాదించిన విద్యార్థులు జాసుమ్ ప్రసాద్,జోష్న,సత్యంబాబుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇట్టి మెడికల్ కాలేజీల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు బాగా చదివి ఎంబిబిఎస్ లో సీటు సంపాదించుకుటున్నారని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో కష్టపడి చదివిన పేద విద్యార్థులకు సీట్లు లభించకపోవడం వల్ల ఎంతమంది పేద విద్యావంతులు వెనుకబడిపోయారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవారికి ఉన్నత చదువులు చాలా దగ్గర అయ్యాయని కోదాడ నియోజకవర్గంలో చదువుకునే విద్యార్థులకు శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఎంతో సహకారం అందిస్తున్నారని అన్నారు.ఈసారి కూడా ఆయనే అధిక మెజార్టీతో గెలుస్తారని పేద వర్గాలకు సహకారంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఆఫీసర్ కె వి ప్రసాద్,గిరిజన ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గు నాయక్,మోజస్,కళ్యాణ్,విజయానంద్,కోయిల,సైదులు,రాంబాబు,డేవిడ్,మేరమ్మ,ద్రాక్షావల్లి,రాణి,జ్యోతి,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎంబిబిఎస్ సీట్ సంపాదించిన విద్యార్థులను సన్మానించిన కోదాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వంటేపాక జానకి యేసయ్య
RELATED ARTICLES



