ఎడ్లబండి పై వాగు దాటి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటిడిఎ పీఓ ఖష్బూ గుప్తా
Mbmtelugunews//కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,సెప్టెంబర్ 25:వాంకిడి మండలంలోని మారుమూల ప్రాంతమైన వెల్గి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను ఉట్నూర్ ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామం మధ్యంలో గల వాగును ఎడ్ల బండిపై దాటి వెల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనం, వైద్యం వివరాలను విద్యార్థులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యనభ్యసించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.



