కోదాడ ఎన్ఎస్పి భూమిలో కోర్టు నిర్మాణాలు చేపట్టవద్ద ని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కు వినతి పత్రం
కోదాడ,ఫిబ్రవరి 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో ఎన్ఎస్పీ భూములను కాపాడుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ పట్టణంలో ఎన్ఎస్పి భూముల్లో కోర్టు నిర్మాణం ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని సిపిఐ ఆధ్వర్యంలో కోదాడ ఆర్డీఓ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కోదాడలో సర్వేనెంబర్ 149/ఎ/1 లో 3.06 ఎకరాల భూమిని నీటిపారుదల శాఖ అధికారుల కార్యాలయ నిర్మాణ నిమిత్తం ప్రభుత్వం కేటాయించిందని గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇట్టి భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే అధికార గృహము రూరల్ పోలీస్ స్టేషన్ ఇతర కార్యాలయాల ఏర్పాటుకు చేశారని ప్రస్తుతం న్యాయస్థాన భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఇట్టి భూమిని నీటిపారుదల శాఖ కార్యాలయాలకు వినియోగించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు గతంలో సిపిఐ పార్టీ పక్షాన అన్యాక్రాంతమవుతున్న ఈ భూమిని కాపాడాలని అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్ఎస్పి భూములను కాపాడాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ మండవ వెంకటేశ్వర్లు లతీఫ్ బత్తినేని హనుమంతరావు చేపూరి కొండలు నాగుల మేర ఉపతల శీను సాహెబ్ అలీ ఆంజనేయులు మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా వార్తలు ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



