ఎన్టీఆర్ విగ్రహాం ధ్వంసం
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్):మండలంలోని రామాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామం నుండి కోదాడకు వెళ్ళే రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం చేయిను ధ్వంసం చేశారు. ఈ ఘటనను ఉదయం గ్రామస్థులు చూడడంతో విషయం భయటకు వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహాంను ధ్వంసం చేసిన వ్యక్తులను కఠిన శిక్షంచాలని పలువురు గ్రామస్థులు, టీడీపీ నాయకులు కోరుతున్నారు.