కోదాడ,అక్టోబర్ 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ ఎన్నికల విధులలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్ లో చేపడుతున్న తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని మరియు ఎన్నికలలో ఉచితంగా పంచే అవకాశం ఉన్న వస్తువులు గుర్తించడం జరుగుతుంది.అందులో బాగంగా గురువారం మరియు శుక్రవారం లలో Rs .31,64,243 /- విలువగల రెడీమేడ్ దుస్తులు మరియు Rs.1,17,930 /- విలువ గల టాయ్స్ నీ గుర్తించి సీజ్ చేసి సంబంధిత ఎన్నికల అధికారులకు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా నల్గొండ డివిజన్ వాణిజ్య పనుల జాయింట్ కమిషనర్ రాజాకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దుగా గల ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ని ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. సరైన పత్రాలు లేని వస్తువులను తరలించిన మరియు ఎన్నికలకు పంపిణీ చేసే వస్తువులను తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీలలో ఏ సిటీవోలు పషియుద్దీన్,బి శ్రీను వారి సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికలలో పంపిణీ చేసే వస్తువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం:నల్గొండ డివిజన్ వాణిజ్య పనుల జాయింట్ కమిషనర్ రాజాకృష్ణ
RELATED ARTICLES



