సరిహద్దు చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి.
:ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్,ఎస్పీ లతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్పీ,పలు శాఖల అధికారులతో సమావేశం.
:సరిహద్దు జిల్లా శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్.
:సమావేశానికి హాజరైన ఇరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల అధికారులు.
కోదాడ,నవంబర్ 02(mbntelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సాఫీగా కొనసాగేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు గురువారం ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు లో ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర శాఖల అధికారులతో,సూర్యాపేట జిల్లా కలెక్టర్,ఎస్పీ,ఇతర జిల్లా యంత్రాంగం తో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్పీలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొనసాగేందుకు పూర్తి సహకారం ఇస్తానన్నారు.ఈ రాష్ట్రం నుండి అక్రమంగా తరలించే మద్యం డబ్బులు ఇతర వస్తువులపై సరిహద్దుల్లో గట్టి భద్రత చర్యలు తీసుకుంటామన్నారు.అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తామన్నారు.

ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ముక్త్యాల చెక్ పోస్ట్ రామాపురం ఎక్స్ రోడ్ చెక్ పోస్ట్ ల వద్ద గట్టి భద్రతను చేపడతామన్నారు.ఆయా శాఖల నుండి పూర్తి సమాచారం సూర్యాపేట డివో జిల్లా కలెక్టర్ ఎస్పీలకు అందిస్తామన్నారు.సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ ఆయా జిల్లాల నుండి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి రవాణా అవుతున్న డబ్బు మద్యంతో పాటు ఇతర అంశాలపై తమ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు,రెవెన్యూ,ఎక్సైజ్,ఇన్,బ్యాంకు,కమర్షియల్ టాక్స్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.



