Friday, December 26, 2025
[t4b-ticker]

ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి………

ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి………

:అంబేద్కర్ అభయా హస్తం పథకంతో ప్రతి దళితుడికి 12 లక్షలు ఇవ్వాలి…….

:డప్పు, చెప్పులు కుట్టుకునే మాదిగలకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి……..

:ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింతాబాబు మాదిగ………

కోదాడ, ఆగస్టు 01 (ప్రతినిధి మాతంగి సురేష్): ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు చింత బాబు మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంబేద్కర్ అభయహస్తం పథకంతో ప్రతి మాదిగకు 12 లక్షల రూపాయలు ఇస్తామని నేటికీ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా డప్పు, చెప్పు కుట్టుకునే మాదిగలకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతోపాటు లెదర్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, కార్యదర్శి బొల్లెపోగు స్వామి, పిడమర్తి బాబురావు, సోమపొంగు శ్రీను, చింతా రాము తదితరులు పాల్గొన్నారు…….

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular