Sunday, April 5, 2026
[t4b-ticker]

ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి జగ్జీవన్ రామ్: సర్పంచి మందుల నాగయ్య

ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి జగ్జీవన్ రామ్: సర్పంచి మందుల నాగయ్య

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 95(ప్రతినిధి మాతంగి సురేష్):ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సోమపంగు గాంధీ అధ్యక్షతన బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి మందులు నాగయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇర్లా జయసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ అండ్ ఎమ్మార్పీఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు సురవరపు వంశీని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా భారతదేశానికి ఎంతో సేవ చేశాడని ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడని ఆ మహోన్నతమైన నాయకుడిని స్మరించుకోవడం నేటి రాజకీయాలలో అటువంటి నాయకులను పోలి నడుచుకోవడం మన అదృష్టంగా భావించాలని వరప్రసాద్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విగ్రహ దాత పులి తిరుపతి బాబు, సోమపంగు శ్రీను, సీఎం శీను, ఇస్సాకు, పున్నయ్య, గామయ్య, బిక్షం, కరుణాకర్, మాదాసి నాగరాజు, కరుణాకార్, బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular