ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్ఎఫ్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం.
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలను భర్తీ చేయడాన్ని ఖండిస్తూ రేపు ఉదయం 10 గం సూర్యాపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శను జయప్రదం చేయాలని స్థానిక ఎమ్మెస్ కళాశాలలో ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్ఎఫ్ నిదుర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా
ఎమ్మెస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ,ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు మాదిగ,ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ,ఎమ్మెస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగలు పాల్గొని మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 11062 టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా అమలు చేయడం మాదిగ జాతికి నమ్మక ద్రోహం చేయడమే అవుతుందని,మాదిగల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉందని అన్నారు.త్యాగాలు చేసి ముప్పై ఏళ్ళ పోరాటం ద్వారా సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటే
ఆ ఫలాలు మాదిగలకు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం దారుణమని అన్నారు.ఇంత అత్యవసరంగా టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని దీనికి రాజకీయంగా
భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ రేపు 9 వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రేపు నల్ల జెండాలతో భారీ ప్రదర్శన జరిగే నిరసన కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుండి మాదిగలు,వర్గీకరణ వాదులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
ఎమ్మెస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కంభంపాటి అంజయ్య మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కుక్కల కృష్ణ మాదిగ,ఎమ్మార్పీఎస్ చిలుకూరు మండల అధ్యక్షులు మల్లెపంగు సూరి,ఎమ్మార్పీఎస్ నడిగూడెం మండల అధ్యక్షులు ముల్గూరి సైదులు మాదిగ,ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు కంభంపాటి విష్ణు మాదిగ,సన్ని మాదిగలు పాల్గొన్నారు