ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం
Mbmtelugunews//నడిగూడెం,అక్టోబర్08(ప్రతినిధి మాతంగి సురేష్)మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈనెల 9 లోపే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని నడిగూడెం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినారు.అనంతరం వారు మాట్లాడుతూ 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా తీర్పును ఆగష్టు1న వెలువరించడం జరిగింది,తీర్పును ఇచ్చిన మరుక్షణమే నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కి రాబోయే నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణకి అనుగుణంగా ఉంటుందని,అలాగే గ్రూపు 1 & 2 మెడిసిన్ సీట్ల కేటాయింపు,విశ్వ విద్యాలయాల్లో సీట్ల కేటాయింపు,ప్రయివేటు రంగం లో కూడా వర్గీకరణ కి అనుగుణంగా చేస్తామని హామి ఇచ్చి ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాలలో 11,062 ఉపాధ్యాయ నియామకాల్లో వర్గీకరణ అనుగుణంగా న్యాయమైన వాటా 1200ల ఉద్యోగాలు మాదిగలు మరియు ఉపకులాలకి రావాల్సి ఉండగా కేవలం 200 మందికే ఉద్యోగాలు రావడం ఈ నెల 9న నియామక పత్రాలు ఇవ్వడం మాదిగలకు మరియు ఉపకులాలకి తీరని అన్యాయం చేసినట్టేనని అన్నారు. తక్షణమే నియామకాలు ఆపాలని,మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ కి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల మరియు ఉపకూలాల ఆవేదనను తెలియజేసేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల నుండి జరిగే నిరసన ర్యాలీలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి అనుబంధ సంఘాలతో పాటు డీఎస్సీలో వెనకబడ్డ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని మరియు ఈనెల 15వ తారీకున హైదరాబాద్ నగర కేంద్రంలో జరిగే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ఎఫ్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ మాదిగ,వంశీ విజయ్,నిఖిత్,రాహుల్,అవినాష్,శ్రీపతి నిఖిల్ తదితరులు పాల్గొనడం జరిగింది