ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని విమర్శిస్తే సహించేది లేదు.
:మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 20(ప్రతినిధి మాతంగి సురేష్):తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ల పైన అబద్ధపు ప్రచారాలు చేస్తే సహించేది లేదని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపమ్మ సుధీర్ హెచ్చరించారుగురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లో మెంబెర్స్ కలిసి సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరాల నుండి కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వారి జీవితాలను అంకితం చేసి ఎక్కడ అవినీతి లేకుండా నీతి నిజాయితీగా రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేసింది,ఇప్పుడు అభివృద్ధి చేస్తుంది మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలని అన్నారు.గెలిచిన ఏడాది లోపే 1200 కోట్ల రూపాయలతో తాగునీరు,సాగునీరు రోడ్లు,డ్రైనేజీ,కాలువలతో పాటు పలు అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నది ఎమ్మెల్యే పద్మావతి అని అన్నారు.ఎమ్మెల్యే పైన నిరూపించలేని ఆరోపణలు చేసి వ్యక్తిగత సోషల్ మీడియా ద్వారా నోటికి వచ్చినట్లు మంత్రి,ఎమ్మెల్యేల పైన ఎవరైనా తప్పుగామాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను,వ్యాపారాలను,ఉద్యోగాలు చేసుకునే విధానం గా సూపరి పరిపాలన అందిస్తున్న ఘనత
మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి కే దక్కిందన్నారు .మంత్రి ఎమ్మెల్యేలకు కుల పిచ్చి మత పిచ్చి లేదని వారికి కేవలం అన్ని వర్గాలను అభివృద్ధి చేయటం ప్రజలకు మేలు చేయడం తప్ప మరేది తెలియదన్నారు.
కులాల వైపు ప్రజలు నిలబడరని కేవలం అభివృద్ధి వైపే నిలబడతారని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గెలుపుతో నిరూపితమైందన్నారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బషీర్,మల్లు వెంకట్ రెడ్డి, గునుగుంట్ల శ్రీనివాస రావు,పొలంపల్లి వెంకటేశ్వర్లు,రాపాలి శ్రీను,చింతకుంట్ల సూర్యం,తమ్మనబోయిన వీరబాబు,జొన్నలగడ్డ మణెమ్మ,దొంగల నాగ వేణు,పోతుగంటి అభిరామ్ పాల్గొన్నారు