ఎమ్మెల్యే జీఎస్సార్ ఆశీస్సులతో మొగుళ్ళపల్లికి 108 సేవలు
Mbmtelugunews//భూపాలపల్లి,డిసెంబర్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్):ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆశీస్సులతో మొగుళ్ళపల్లి మండల ప్రజలకు 108 సేవలు అందుబాటులోకి వచ్చాయని, గత కొన్నేళ్ళుగా మొగుళ్లపల్లి మండల ప్రజలకు 108 సేవలు అందుబాటులో లేని కారణంగా మండలంలోని ప్రజలు ప్రమాదాల బారిన పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారని, మరికొందరు ఆర్థికలేమిటో ప్రాణాలను కోల్పోయేవారని, దీంతో మండల ప్రజల సౌకర్యార్థం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి మండల ప్రజల మీద ఉన్న ప్రేమతో 108 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం రోజు భూపాలపల్లిలో జరిగిన మంత్రుల పర్యటనలో 108 అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. కాగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.