ఎమ్మెల్సీ క్యాంపెనింగ్ ప్రారంభించిన పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 02 (ప్రతినిధి మాతంగి సురేష్)పిఆర్టియు టిఎస్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిన్న రాత్రి కోదాడ మండలం బండపాలెం గ్రామంలో ఎంతో పురాతనమైన ఎంతో చరిత్ర గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్సీ క్యాంపెనింగ్ ప్రారంభిస్తున్న మన ఎమ్మెల్సీ అభ్యర్థి పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి,సూర్యాపేట జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు తంగెళ్ల జితేందర్ రెడ్డి,తీగల నరేష్ లు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గానికి ఈశాన్య దిక్కులో గల ఎంతో మహిమగల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి క్యాంపెనింగ్ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య,మాజీ మండల విద్యాధికారి ఓరుగంటి రవి,సూర్యాపేట జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.