ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్రీడా దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//జోగులాంబ గద్వాల,ఎర్రవల్లి,ఆగష్టు 29:ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్రీడా దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్రవల్లి మండల విద్యాధికారి ఆర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.విద్యార్థులందరూ మార్చ్ ఫాస్ట్ చేసి ముఖ్య అతిథులకు గౌరవ వందనం చేశారు.తర్వాత విద్యార్థి నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.

అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ధ్యాన్ చందు వరుసగా ఒలంపిక్స్ లో మూడుసార్లు బంగారు పతకం సాధించి దేశ ఔన్నత్యాన్ని చాటారని,అలాగే విద్యార్థులు కూడా చదువుతోపాటు క్రీడలలో రాణించాలని ఆయన సభాముఖంగా తెలియజేశారు.పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చేసిన గౌరవ వందనం నృత్య ప్రదర్శన చాలా చక్కగా చేశారని అలాగే క్రీడా స్ఫూర్తి భావంతో ముందుకు సాగాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ జి జిల్లా సెక్రటరీ జితేందర్,డివైఎస్ఓ బిఎస్ ఆనంద్,ఎర్రవల్లి మండల రిటైర్డ్ ఎంఈఓ రాజు,ఫుట్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బండల వెంకట రాములు,రిటైర్డ్ డైరెక్టర్ వీర వసంత రాయుడు,ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జోగుల రవి,ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్,పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,ప్రిన్సిపల్ నందిని,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ కి 966635848 కి పంపించగలరు



