Friday, December 26, 2025
[t4b-ticker]

ఎవరైనా బిఆర్ఎస్ నాయకులను,కార్యకర్తలను ఇబ్బందులు పెడితే నేను అండగా ఉండి కాపాడుకుంటాను:బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ,జనవరి 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాబోవు రోజుల్లో వచ్చే ఎన్నికలకు నాయకులు,కార్యకర్తలు సిద్ధం కావాలని కోదాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం కోదాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని నాయకులకు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ , మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యకర్తలు అధైర్య పడవద్దు..మీకు వెన్నంటి నేను వుంటానని ఆయన అన్నారు.కోదాడ నియోజకవర్గ ప్రజలకు,కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఎవరైనా నాయకులను, కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ వారు ఇబ్బంది పెడితే నేను అండగా ఉండి కాపాడుకుంటాను.ఎన్నికల తరువాత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారు.

కోదాడ నియోజకవర్గంను అన్ని విధాలా అభివృద్ధి చేసింది మనమేనని ఆయన అన్నారు.మల్లన్న యువసేన ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాము.నియోజకవర్గ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు మన పార్టీకి బలమైన నాయకులు అద్భుతమైన నాయకత్వం ఉన్నదని తెలిపారు.ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటాం అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతాం ఆయన అన్నారు.కోదాడ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడవద్దు,అదైర్యపడొద్దు పార్టీ నాయకులను,కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను,పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి కష్ట సుఖలలో అండగా ఉంటానని మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా మండల ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు,సర్పంచులు,ఎంపిటిసిలు,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular