ఎస్వీ హై స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణం లోని స్థానిక ఎస్వీ హై స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.విద్యార్దులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించి అలరించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర్రావు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్ తరగతి గోడల మధ్య నిర్ణయించబడుతుంది అని బాలలు తమ హక్కులను తెలుసుకుని భవిష్యత్ లో మంచి విద్యావంతులుగా ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ముత్తినేని సంధ్యారాణి,ప్రిన్సిపాల్ వల్లి పద్మ,రాణి,అంజయ్య,రాజా,వీరబాబు,దాస్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.