ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుక
కోదాడ,జులై 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో డీజీఎం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ పాల్గొని బోనం ఎత్తుకొని పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిఅందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు.అనంతరం ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని మతాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు.అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకున్నారు.దీనిలో భాగంగా విద్యార్థులు శివసత్తుల,పోతరాజు వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాయి.వివిధ సంస్కృతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపేందర్,రఫీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.