ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 1(ప్రతినిధి మాతంగి సురేష్): ఎస్సార్ ప్రైమ్ స్కూల్ డీజీఎం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జోనల్ ఇంచార్జ్ సురేష్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దేవుని ఆశీస్సులు పిల్లలందరికీ కలగాలని కోరుకున్నారు.ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పూలను దైవంగా భావించి పూజించడం జరుగుతుంది అని చెప్పారు. ఈ పండుగ 9 రోజులు ఘనంగా నిర్వహిస్తారు అని తెలియజేశారు. ప్రకృతి ని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ అని తెలియజేశారు. విద్యార్థులు బతుకమ్మని తయారు చేసి ఆటపాటలతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపు కొన్నారు. అనంతరం బతుకమ్మ లను నీటిలోకి వదిలి మళ్లీ రావమ్మా అని పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.