Sunday, July 6, 2025
[t4b-ticker]

ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి:టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతాబాబు మాదిగ.

కోదాడ,జులై 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఏబిసిడి వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ అన్నారు.శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ లో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు.కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి నేటికి 9 సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయకుండా మాదిగలను మోసం చేసిందన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయకపోతే రానున్న రోజుల్లో బిజెపి పార్టీని ఓడించడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు,ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓబిసి,మైనార్టీ నాయకులు పంది తిరుపతయ్య,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కలకొండ ఆదినారాయణ,ఎస్సీ నాయకులు వేమిడాల ఆనందరావు,వెంకటయ్య,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పోలంపల్లి శ్రీను,ప్రసాద్,పిడమర్తి బాబురావు,పంది యేసు,ఉప్పలయ్య,చింత వినయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular