కోదాడ,జులై 28(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ఏండ్ల తరబడి రాజకీయ నాయకుల మాటలకే పరిమితమైన కోదాడ పెద్ద చెరువు అలుగు బ్రిడ్జి నిర్మాణం.ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న ప్రజా ప్రతినిధులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ బ్రిడ్జి పై నుండి వర్షపు నీరు పెద్ద మొత్తంలో ప్రవహిస్తుంది కోదాడ నుండి అనంతగిరి మండలం వైపు వెళ్లే ప్రజలు వాహనదారులు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని భయభ్రాంతులకు గురవుతూ రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఉంది అని అన్నారు.ప్రతి సంవత్సరం మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా అలుగు వద్ద ఉన్న గుర్రపు డెక్కన్ తొలగించి చేతులు దులిపేసుకుంటున్నారని అన్నారు. పెద్ద చెరువుకి మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పుకునే నాయకులు అలుగు విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. కనీసం ఇరుపక్కల రెయిలింగ్ నిర్మించడంలో సంబంధిత అధికారులు విఫలం చెందారని అన్నారు. గతంలో కొన్ని ప్రచార మాధ్యమాలలో ప్రచరితమైనప్పటికీ స్పందించని అధికారులు.ఇది ఇలానే కొనసాగితే ప్రజల ప్రాణాలకు ముప్పుందని సర్వసాధారణంగా స్కూల్ బస్సులు కోదాడ నుండి చుట్టుపక్కల గ్రామాలకి వెళ్తూ ఉంటాయి అనుకోని ప్రమాదం జరిగితే భారీ ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తక్షణమే అధికారులు స్పందించి పర్మినెంట్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.
ఏండ్ల తరబడి రాజకీయ నాయకుల మాటలకే పరిమితమైన కోదాడ పెద్ద చెరువు అలుగు బ్రిడ్జి నిర్మాణం.:రాకపోకలలో ఇబ్బంది పడుతున్న ప్రజలు
RELATED ARTICLES