తెలంగాణ,మార్చి 05(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తాము ఎంత గౌరవం ఇచ్చామో అందరికీ తెలుసు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం ఏం చేయడం లేదనే 2021 నుంచి కేసీఆర్ దూరం పెట్టారని గుర్తుచేశారు. నాలుగు నెలల క్రితమే గుజరాత్‌ను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు గుజరాత్ మోడల్ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ఏక్‌నాథ్ షిండేలా బీజేపీలో చేరడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు.
*మాయమాటలతో ప్రధాని మోడీని బుట్టలో వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని* విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులను కడుపులో పెట్టుకొని ఉపాధి కల్పించిందని.. *తమ మీద కోపంతో కాంగ్రెస్ సర్కార్ నేతన్నలకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం లేదని* విమర్శించారు.
*ఏక్‌నాథ్ షిండే మాదిరి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం: కేటీఆర్..*
RELATED ARTICLES



