ఏడొద్దుల పండుగలో పాల్గొని అల్లా దీవేనలు పొందగలరు:ముజావర్లు
కోదాడ,జులై 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మనం ఈరోజు మొహరం అనే పండగ చేసుకునే సమయం అయితే మొహరం అనగా పీర్ల పండుగ పీర్ల పండుగ అనగా అది ఒక పండగ కాదు అనేకమంది ముస్లిమ్ ల యొక్క మనసులో ఉన్న బాధ,ఆ బాధ ఏమిటి అంటే సుమారు 14వ శతాబ్దంలో మన భారత దేశంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం,అరాచకం,ముస్లిం పై జరుగుతున్న హింసకు ప్రతిగా శత్రుల పై ధర్మ యుద్ధ పోరాటం జరిగింది ఈ ధర్మ యుద్ధ పోరాటంలో ఎందరో మహానుభావులు అమరులైనారు దాని గుర్తుగానే ఈ పీర్ల పండగ ఏర్పడింది.అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను హిందూ ముస్లిం సోదరులు బాయ్ బాయ్ గా కలిసిపోయి ప్రవక్తల గుర్తుగా ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు.అయితే ఈ సందర్భంగా మన తమ్మర గ్రామంలో పూర్వం రోజులలో చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకునే వారు,అదే రీతిగా శనివారం( ఏడొద్దులు ) రోజునఈ పండుగను మహా అద్భుతంగా జరుపుటకు తమ్మర గ్రామంలో మన ముస్లిం పెద్దలు( ముజావర్లు) నిర్ణయించినారు.కావున తమ్మర గ్రామం చెందిన అన్ని వర్గాలకు చెందిన అక్క చెల్లెల్లు, అన్నదమ్ములు,పిల్లలు,పెద్దలు, పాల్గొని వారి యొక్క అవసరాలు అనగా సంతానం లేని వారు సంతానం కొరకు, ఉద్యోగం లేని వారు ఉద్యోగం కొరకు,గాలి ధూళి ఆవరించిన వారు వాటిని తొలగించుటకు,ఇంకా కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా మీరు అల్లాపై నమ్మకం ఉంచి అనగా పీర్ల రూపంలో ఉన్న ప్రవక్తలను నమ్మి వచ్చి మీకు మీ కుటుంబాలకు ఉన్న ప్రతి ఒక సమస్యను పరిష్కరించుటకు శనివారం ఏడొద్దులు రోజున మన పీర్ల సావిడి దగ్గరకు వచ్చి వారి యొక్క దీవెనలు,ఆశీస్సులు పొందగలరని ముజావర్లు కోరుతున్నారు.