ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): వైయస్ జగన్మోహన్ రెడ్డి యూత్ గణపవరం వారి ఆధ్వర్యంలో ప్రజాసేవకు అంకితమైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఆదివారం గ్రామములో నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే నిరుపేదలను ఆదుకున్న గొప్ప నాయకుడు అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నిరుపేదలకు అనేక సమక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడని తెలిపారు గ్రామములో వైయస్ జగన్మోహన్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మునుముందు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంచూరి శ్రీధర్ రెడ్డి, తరుణ్ రెడ్డి,ఆదిరెడ్డి,గౌతంరెడ్డి,సురేష్ రెడ్డి,నాగిరెడ్డి,అంచూరి అనిల్ రెడ్డి,గడ్డం అనిల్ రెడ్డి,ప్రసాద్ రెడ్డి,యశ్వంత్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,జంగం శ్రీను,కోటిరెడ్డి,గోవర్ధన్ రెడ్డి,జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.



