ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
:నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
:స్క్రోలింగ్:16-10-24@6AM
Mbmtelugunews//ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 16(ప్రతినిధి మాతంగి సురేష్):నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం
చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది
వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఇవాళ విస్తృతంగాతేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
దక్షిణకోస్తా & రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
~ రోణంకి కూర్మనాథ్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ