ఏరియా ఆసుపత్రిలో ఓ.పి బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
:పార్కింగ్ షెడ్,ధోభీ ఘాట్ లతో పాటు అదనపు ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు.
:3.60 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
mbmtelugunews//నవంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్):హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఓ.పి.బ్లాక్ నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు.అంతే గాకుండా ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ షెడ్ తో పాటు,దోబీ ఘాట్ నిర్మాణం,అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుకు ఆయన నిధులు మంజూరు చేయించారు.మంత్రి ఉత్తమ్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల 60 లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.