కోదాడ,జూన్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐఐటి ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశాల కొరకై జరిగిన.అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ ఫలితాలు ఆదివారం గౌహతి ఐఐటి విడుదల చేసింది. ఈఫలితాలలో కోదాడ రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన ఉస్తెల సుఖేష్ రెడ్డి 2067 వ ర్యాంక్ ,
కే మహాలక్ష్మి3009 వ ర్యాంక్,ఎండి సానియా తబ్స్ం 4411 వ ర్యాంక్,ఎం నంద గోపాల్ 5730,వ ర్యాంక్,యు .అక్షర సమైక్య 5746 వ ర్యాంక్.వై వినయ్ 7270 వ ర్యాంక్ వివిధ కేటగిరీలలో సాధించారు.ఈ సందర్భంగా రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎంసెట్,మెయిన్స్,నీట్ ఫలితాలలో అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడమే కాకుండా నేడు జాతీయ స్థాయిలో ఐఐటీ ప్రవేశాల కొరకు జరిగిన అడ్వాన్సుడ్ ఫలితాలలో కూడా అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ర్యాంకులు సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ర్యాంకుల సాధనలో కృషిచేసిన అధ్యాపకులను, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రిన్సిపాల్,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.