ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం
:విద్యార్థులకు విద్యతోనే భవిష్యత్తు
:శ్రీ చైతన్య ఈజీఎం మురళీకృష్ణ
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్): విద్యార్థులకు విద్యతోనే మంచి భవిష్యత్తు ఉందని విద్యను ఎవరు దొంగలించలేరని గొప్ప చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీ చైతన్య ఈజిఎం మురళీకృష్ణ అన్నారు. 2022- 23 విద్యా సంవత్సరంలో శ్రీ చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్ లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐఐటీలో 22 మంది, ఎన్ఐటీలో 29 మంది, ఎయిమ్స్ ఢిల్లీలో ఒకరు సీట్లు సాధించారు వారిని సన్మానించే కార్యక్రమం సోమవారం శ్రీ చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ చైతన్య ఈజీఎం మురళీకృష్ణ పాల్గొని విద్యార్థులను శాలువా బొకేతో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మా పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని మా కళాశాలలోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి లో సీట్లు సాధించడం అభినందనీయమని అన్నారు. వీరిలో ఒక విద్యార్థి ఆల్ ఇండియా 8వ ర్యాంకు సాధించి ఎయిమ్స్ ఢిల్లీలో సీటు సాధించినట్లు తెలిపారు. మా పాఠశాలలో చదివిన సూపర్ సీనియర్ శృతిలయ వారణాసి ఐఐటీలో సీటు సాధించి 60 లక్షల ప్యాకేజీ సాధించినందుకు ఆమెని ఘనంగా సత్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటయ్య, తెలంగాణ కోఆర్డినేటర్ జయరాజు, ప్రిన్సిపల్ గోపాలస్వామి, సూర్యాపేట కోఆర్డినేటర్ వెంకట్, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



