Thursday, December 25, 2025
[t4b-ticker]

ఐజేయు నుండి టియుడబ్ల్యూజె 143 యూనియన్ కి భారీ చేరికలు:యూనియన్ సభ్యత్వం తీసుకున్న సీనియర్ జర్నలిస్టు పిడమర్తి గాంధీ,గంధం రాము, వేణుగోపాలు,చలిగంటి దామోదర్

కోదాడ,ఆగష్టు16 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఐజేయు నుండి టియుడబ్ల్యూజె 143 యూనియన్ కి భారీగా చేరినారు జర్నలిస్టుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ టిడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ మాత్రమేనని జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్ రావు లు అన్నారు.ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు సంఘం నుండి సభ్యత్వాన్ని రద్దు చేసుకొని, తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ టిడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ లోకి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ పిడమర్తి గాంధీ,గంధం రాము,వేణుగోపాలు,చలిగంటి దామోదర్ లు జిల్లా ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ …ప్రభుత్వ వారధిగా ఉంటూ నిత్యం జర్నలిస్టు సమస్యలపై మరియు ఇండ్ల స్థలలకై పోరాడుతున్న యూనియన్ టి డబ్ల్యూ జే హెచ్ 143 మాత్రమే అన్నారు.యూనియన్ యొక్క విధి విధానాలకి ఆకర్షితుడై యూనియన్ లో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు.అనంతరం నూతనంగా సభ్యత్వం తీసుకున్న గాంధీ,రాము,వేణుగోపాలు,దామోదర్ లకు పలువురు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు,టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సంపత్,టీయూడబ్ల్యూజే హెచ్ 143 నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్,ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు వెన్నబోయిన పూర్ణచందర్ రావు,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్,ఎలక్ట్రాన్ మీడియా ఉపాధ్యక్షులు చింతలపటి సురేష్,కొలిచలం నరేష్,హారిష్ తదితరులు పాల్గొన్నారు…

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular