ఐవిఓ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
:ఆపరేషన్ సిందూర్ దేశ చరిత్రలో సువర్ణ అక్షరం.
: డా, చంద్రశేఖర్, డా, గుండా మధుసూదన్ రావు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 15 (ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని ఐవిఓ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ కో. ఆర్డినేటర్ అండ్ ఐవో నేషనల్ పిల్లర్ మెంబర్ డా.జి.మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఇంటిగ్రేటెడ్ వెటర్నర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ వెటరన్ డా చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండాకు కృషి చేసిన పలువురిని సన్మానించి, ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారని వారి ప్రాణత్యాగ ఫలితమే నేడు స్వతంత్ర పుణ్యఫలితం అని అన్నారు.

నేడు దేశ సరిహద్దులలో దేశం కోసం పోరాటం చేస్తున్న ఎంతోమంది సైనికుల త్యాగమే మనం ఈరోజు ఇలా జాతీయ పండుగలు జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఐవిఓ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజులలో ఐ వి ఓ ఆధ్వర్యంలో కోదాడ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ఐవిఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



