ఒలంపిక్స్-2024 ప్రారంభోత్సవ శుభాకాంక్షలు
కోదాడ,జులై 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:(26-07-2024)న పారిస్ లో ప్రారంభము కానున్న ఒలంపిక్స్ 2024 లో భారతదేశం తరుపున పాల్గొంటున్న 117 మంది క్రీడాకారులకు స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం అప్పారావు మాట్లాడుతూ క్రీడా ప్రపంచంలో క్రీడాకారులు,క్రీడాభిమానులు ఈ 17 రోజులపాటు స్వర్గనుభూతిని పొందుతారని తెలిపారు.విద్యార్థులు మార్చి ఫాస్ట్ చేస్తూ క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తూ ప్రపంచ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పాఠశాలలో,నిత్యం నిర్వహించే అథ్లెటిక్స్ ను నిర్వహించి పిల్లల్లో ఒలంపిక్స్ క్రీడా స్ఫూర్తిని పిఈటి రాంబాబు కలుగజేశారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వై సంతోష్ కుమార్,ఇన్చార్జులు రామ్మూర్తి,ఝాన్సీ,నవ్య ఇతర ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.