కోదాడ,ఫిబ్రవరి 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి….
ఓటు హక్కు పై అవగాహన….
కోదాడ పట్టణంలోని తేజా టాలెంట్ స్కూల్లో సోమవారం రోజు తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర సభ్యులు కుంభం శ్రీను, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంపల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ప్రజల కోసం ప్రజా సేవ చేసే ప్రజానాయకుడిని ఎన్నుకున్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు అలాంటి వ్యక్తిని ప్రజా నాయకుడిగా ఎన్నుకోవాలని అన్నారు.



