ఓ కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
బాన్సువాడ, ఆగష్టు 03(mbmtelugunews)ప్రతినిధి మతంగి సురేష్:బాన్సువాడ పట్టణంలోని బోర్లం రోడ్డులో ఓ కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న యువకులు గమనించి నిందితుడిని చితకబాది పోలీసులకుసమాచారం ఇచ్చారు.అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరు కూడా సోమేశ్వర్ గ్రామాస్థులుగా తెలిసింది.