కంగ్రాట్స్ నిహారిక
Mbmtelugunews//హైదరాబాద్,ఆగష్టు 13 ప్రతినిధి మాతంగి సురేష్:నూతన దర్శకులు, నటీనటులను ప్రోత్సహించాలని, కొత్త కథలను ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నటి నిహారిక సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 16 మంది నూతన నటీనటులతో తాజాగా ఆమె నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ . గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో దీనిని రూపొందించారు. తాజాగా ఈ సినిమా గురించి నటుడు మహేశ్బాబు ట్వీట్ చేశారు. నిహారికకు అభినందనలు తెలిపారు. “కమిటీ కుర్రోళ్ళు’ గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టినందుకు, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ నిహారిక. త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తా” అని ట్వీట్ చేశారు.