కత్రం చారిటబుల్ ఫౌండేషన్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం…
కత్రం ఆరోగ్య సేవ వాహన ప్రారంభం కార్యక్రమంలో ….ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ,జూన్ 15(ప్రతినిధి మాతంగి సురేష్):కత్రం చారిటబుల్ ఫౌండేషన్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు.ఆదివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో కత్రం శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞ రెడ్డి దంపతుల కుమారుడు శివ కార్తికేయ రెడ్డి తొలి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కత్రం ఆరోగ్య సేవ వాహన ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే పేదలకు మరింత మేలు జరుగుతుందన్నారు.ప్రజల కోసం పనిచేస్తామనే వారికి తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు శ్రీకాంత్ రెడ్డి ఉన్నత స్థానానికి ఎదిగి పేదలకు విద్య వైద్యం అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.కత్రం ఆరోగ్య సేవలు ఒక్క కోదాడ నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్న శివ కార్తికేయ కు ఆశీస్సులు అందజేశారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తోటి వారి కోసం నేను సైతం అంటూ తన వంతు బాధ్యతగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని కృషి చేస్తున్నానన్నారు.భవిష్యత్తులో కత్రం ఆరోగ్య సేవలు రాష్ట్రం అంతా విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు.ప్రస్తుతం వైద్య సేవలు కోదాడ నియోజకవర్గంలోని కోదాడ,అనంతగిరి,చిలుకూరు,నడిగూడెం మండలాల్లో లోని గ్రామాలకు ఈ వాహనం ద్వారా ఉచితంగా వైద్య సేవలు మందులు అందిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు,కోదాడ ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బారావు,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల,అనంతగిరి మండలం మాజీ ఎంపీపీ చండూరు వెంకటేశ్వరరావు,మాజీ సర్పంచులు ఎర్నేని బాబు,పార సీతయ్య,సత్యబాబు,కత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి,అభిజ్ఞ రెడ్డి,మాజీ జెడ్పిటిసి ఉమా శ్రీనివాస్,ఆర్డిఓ సూర్యనారాయణ,ఎంఈఓ సలీం షరీఫ్,ముడియాల భరత్ రెడ్డి,ముడియాల సత్యనారాయణ రెడ్డి,కత్రం కిరణ్ రెడ్డి,మోహన్ రెడ్డి,బాబుజి రెడ్డి,కత్రం సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.