కత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
: కత్రం ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ పోటీలో
: కత్రం శ్రీకాంత్ రెడ్డి సేవలు కొనియాడలేనివి
:సీనియర్ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు
Mbmtelugunews//కోదాడ,జనవరి 09(ప్రతినిధి మాతంగి సురేష్): క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వాన్ని పటిష్టంగా ఉంచటానికి తోడ్పడతాయని సీనియర్ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. శుక్రవారం కత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైపాస్ లో గల గ్రౌండ్ లో కత్రం ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ పోటీలను కత్రం ఫౌండేషన్ సభ్యులు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, ఎర్నేని వెంకటరత్నం బాబు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, రాజమోహన్ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు లు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కత్రం శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞా రెడ్డి లు ఇతర దేశాలలో ఉంటూ సొంత గ్రామానికి, సొంత నియోజకవర్గానికి సేవ చేయాలనే సంకల్పంతో కత్రం ఫౌండేషన్ ఏర్పాటుచేసి గత మూడు సంవత్సరాలు క్రికెట్ పోటీలను విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు కత్రం ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడల్లో కాకుండా విద్యపై ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతోమంది చదువుకు బాసటగా నిలిచి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని కొనియాడారు. కత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ మొబైల్ వ్యాన్ ఏర్పాటుచేసి దాంట్లో డాక్టర్లను హెల్త్ సిబ్బందిని ఏర్పాటుచేసి గ్రామాలలో ఎంతోమందికి ఆరోగ్య విషయంలో బాసటగా నిలుస్తున్నారని అన్నారు.

కత్రం విద్యా చేయూత కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెడికల్ విద్యార్థి పిడమర్తి రంజిత్ కు రూ.25 వేల ఆర్థిక సాయం చెక్కును అందించారు. అలాగే ఇటీవల ఇండో- నేపాల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వడ్డేబోయిన సతీష్ కుమార్, జాతీయస్తాయి మాస్టర్ ఆర్ట్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మేళ్లచెరువు కార్తీక్ రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ సీఐ శివ శంకరనాయక్, ఎర్నేని వెంకటరత్నం బాబు, ముత్తవరపు పాండురంగారావు, పి. సత్తిబాబు, , కృష్ణారెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ జ్ఞానెందర్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు, ముత్తవరపు రామారావు, వీరారెడ్డి, కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కత్రం కిరణ్ రెడ్డి, బుడిగ రామాంజనేయులు, ముడియాల సత్యనారాయణ, వేనేపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.



