కోదాడ,జనవరి 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తమ్మర బండపాలెం గ్రామంలో స్వయంవ్యక్తముగా వేంచేసియున్న శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములు వారి “ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు “వారి ఆధ్వర్యంలో నిర్వహింప బడుచున్న ధనుర్మాసం తిరుప్పావై ప్రవచనాలు దివ్యంగా సాగుచున్న నేపథ్యంలో శనివారం నాడు 9 గంటలకు 28వ పాశురమైన “కఱవైగళ్”పాశురార్థవివరణ,తాత్పర్యము,ప్రాశస్త్యము గూర్చిచాలా వైభవముగా ప్రవచనము నిర్వహింపబడినది.

ఆ తరువాత 10 గంటల నుండి 12 గంటల వరకు శ్రీవారి శ్రవణ నక్షత్ర యుక్త మాస కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగినది.అనంతరము మహా నివేదన,మంగళాశాసనము తీర్థ ప్రసాద వినియోగం,పీటల మీద కూర్చున్న దంపతులకు అన్న ప్రసాద వితరణ జరిగినది.ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు,ఆలయ అర్చకులు,చైర్మన్ శ్రీమాన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు,వారి కుమారులు ముడుంబై నారాయణాచార్యులు,స్థానాచార్యులు,మాస కల్యాణ నిర్వాహకులు తిరుప్పావై ప్రవచనకర్తలు అయిన శ్రీమాన్ ముడుంబై లక్షణాచార్యులు, ముడుంబై శ్రీనివాసాచార్యులు,ముడుంబై రామలక్ష్మణాచార్యులు,దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి టివి చలపతి,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.



