కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణ పరిధి తమ్మర బండ పాలెం లోని శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆలయలో వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన నారసింహ హోమం లో పాల్గొన్న కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ.వారు ముందుగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణము లో నిర్వహించిన శ్రీ సుదర్శన నారసింహ హోమం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెంలో గల శ్రీ దేవల్ బాలాజీ దేవాలయం ఎంతో పురాతనమైనది ఈ దేవాలయంలో భక్తులు కోరుకున్న కోరికలు తీరుతున్నాయని రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు ఈ దేవాలయాన్ని సందర్శించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత మన ముఖ్యమంత్రి కెసిఆర్ దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ది చేస్తున్నారు అని, ఆ నరసింహ స్వామి అనుగ్రహం తో కోదాడ పట్టణ వాసులు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలు తో విరాజిల్లుతూ ఉండాలి అని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కనగాల రాధాకృష్ణ,వెలిది పూర్ణ చారి,ముడుంబై లక్ష్మణాచార్యులు,దొంగరి బాబు పృథ్వి తదితరులు పాల్గొన్నారు.