రెండవ భద్రాద్రిగా ప్రఖ్యాతి గాంచిన తమ్మరకు పోటెత్తిన భక్తజనం
కోదాడ,ఏప్రిల్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రెండవ భద్రాద్రిగా ప్రఖ్యాతి గాంచిన కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మరలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండువగ నిర్వహించారు. ముందుగా దేవతామూర్తుల ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా జరిపి ఆలయ ప్రాంగణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కల్యాణ మండపంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అర్చకులు వేద పండితులు స్వామివార్ల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం కత్రం వంశీయులు స్వామివార్లకు తలంబ్రాలు,పట్టు వస్త్రాలను సమర్పించారు.కాగా కోదాడ పట్టణ ప్రముఖులు స్వామివారి కల్యాణోత్సవం లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బత్తినేని వేణుగోపాలరావు ప్రముఖులను శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని వేలాది మంది భక్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షులు బత్తినేని వేణుగోపాలరావు మాట్లాడుతూ ఈ ఆలయానికి పూర్వం రెండు వందల సంవత్సరాల చరిత్ర కలదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఆలయం రెండవ భద్రాద్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని ఈ కళ్యాణానికి రెండు రాష్ట్రాల ప్రజలు హాజరైనారని ఈ కళ్యాణాన్ని ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.



