Monday, July 7, 2025
[t4b-ticker]

కమాటీల కొలువులు కొనసాగేనా?

కమాటీల కొలువులు కొనసాగేనా?

:మమ్ములను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో మాకు తెలియాలి.

:ఆరు నెలలుగా జీతాలు లేని 110 మంది కమాటీలు.

:ఇల్లు గడవక పిల్లల ఫీజులు కట్టక సమస్యలతో సతమతం.

:కమాటీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

:కొత్త కమిషనర్ వచ్చినప్పుడల్లా తప్పని తిప్పలు.

:మూడు సంవత్సరాల నుండి కొలువు చేస్తున్న ఉద్యోగ భద్రత కల్పించని సంబంధిత అధికారులు.

:మా సమస్యలను పరిష్కరించి మా కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలి.

కోదాడ,నవంబర్ 09: గత మూడు సంవత్సరాల నుండి కోదాడ మున్సిపాలిటీలో 110 మంది కమాటీలు పులువు చేసుకుంటూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నారు. కానీ వారికి ఏ ప్రాతిపదికన పులుసు కేటాయించారు తెలియని పరిస్థితి గత ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులకు విన్నవించుకున్న వారికి జీతాలు రాకపోవడంతో శనివారం ఉదయం విధులకు వెళ్లకుండా మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు కామాటీలు మాట్లాడుతూ మాకు వచ్చేదే నెలకు 11,500 జీతం ఆ జీతం తోటి మా కుటుంబాన్ని పోషించుకుంటూ మా పిల్లలను చదివించుకోవడం మాకు ఎంతో ఇబ్బందిగా ఉన్నది అయినా సరే ఇంకా కొన్నాళ్ళకు మా బతుకులు మారుతాయి అని మేము కొలువులు చేస్తూ కోదాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిత్యం శ్రమిస్తున్నాము. అయినా సరే మా జీతాలు ఇవ్వడంలో సంబంధిత అధికారులు అలసత్వం వహిస్తున్నారు మాకు జీతాలు రాక కుటుంబ పోషణ భారం అయ్యి పిల్లల ఫీజులు కట్టక స్కూల్ నుంచి పంపుతున్నారు అని వేడుకున్నా కూడా మా జీతాలు వేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో నిరసన తెలియజేశామని అన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular