కోదాడ,నవంబర్ 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మాదిగలకు వర్గీకరణ పట్ల స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగలను మరోసారి మోసం చేశారని టి ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతాబాబు మాదిగ అన్నారు.సోమవారం కోదాడ పట్టణంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతు 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమానికి గత ప్రభుత్వాలు కూడా కమిటీలు వేసి కాలయాపన చేసి మాదిగలకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా మోసం చేశాయని ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ వర్గీకరణకు కమిటీలు వేస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు.నాడు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేపడతామని బిజెపి ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందన్నారు.రాష్ట్రంలో బిజెపి బలపడడానికి మందకృష్ణ మాదిగ తన స్వార్థం కోసం విశ్వరూప సభ పేరుతో మాదిగ జాతిని రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు కిషన్ రెడ్డితో కలిసి మాదిగలను మోసం చేస్తున్నారని ధ్వజం ఎత్తారు.ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే నేటి వరకు పట్టించుకోవడం లేదన్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూర నాగరాజు,మండల అధ్యక్షులు పోలంపల్లి శ్రీను,చిలుకూరు మండల అధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు,నారకట్ల ప్రసాద్, రామారావు,పిడమర్తి. బాబురావు,వెంకటేష్,వేణు,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కమిటీల పేరిట మాదిగలను మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం.:మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మందకృష్ణ.:విశ్వరూప సభలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా మాదిగలను మోసం చేసిన నరేంద్ర మోడీ:టిఎమ్ఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ
RELATED ARTICLES



