కరివిరాల ఆదర్శ పాఠశాల,జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి.భాను నాయక్
Mbmtelugunews//కోదాడ,(నడిగూడెం)నవంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): నడిగూడెం మండలం కరివిరాల గ్రామంలో గల ఆదర్శ పాఠశాల మరియు కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి.భాను నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతులు జరుగుతున్న తీరు నిషితంగా పరిశీలించిన ఆయన పాఠ్యంశాలను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.ప్రయోగాశాలలను క్షుణ్ణంగా పరిశీలించి అన్ని ప్రయోగలను పిల్లలతో చేయించాలని ప్రయోగత్మక అనుభవం కలిగించాలని,ప్రాక్టికల్స్ నిర్వహణలో పకడ్బందీగా ఉండాలని ప్రత్యేకంగా ప్రాక్టికల్స్ సమయపాలన పాటించాలని తెలియజేస్తూ,ప్రయోగశాలలో గల వివిధ పరికరాల పనితీరుని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



