కరెంటు సరఫరా కొరకు బుడగజంగాల కుటుంబాలు ధర్నా :
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 27:బుడగ జంగాల కాలనీకి చెందిన నివాసాలకు కరెంటు సరఫరా కల్పించాలని బుడగ జంగాలకు చెందిన కుటుంబాలవారు ధర్నా నిర్వహించారు.మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన బుడగ జంగాల కుటుంబాల వారు మా కాలనీకి కరెంటు సరఫరా కల్పించండి అంటూ ధర్నా నిర్వహించారు.కరెంటు సరఫరా లేకపోవటంతో కాలనీలో దోమలు కుట్టి విష జ్వరాల బారిన పడుతున్నామని ఈ మధ్యకాలంలో ఇరువురు పాము, తేలుకాటు కు గురయ్యారని ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ సరఫరాను నిలిపివేశారని.దీంతో కాలనీలో ఉన్న కుటుంబాలు చీకట్లో భయం భయంగా గడుపుతున్నామని విష పురుగుల బారినపడి ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయానని భయాందోళనకు గురవుతున్నామన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా మాకు విద్యుత్ సరఫరా కొనసాగించాలని కోరారు.ధర్నా చేస్తున్న వారితో స్థానిక ఎస్సై జి అజయ్ కుమార్ మాట్లాడి సమస్యను సంబంధిత విద్యుత్ అధికారి సైదా దృష్టికి తీసుకువెళ్లగా విద్యుత్ అధికారి మాట్లాడుతూ జంగాల కాలనీ వారికి విద్యుత్ మీటర్లు లేవని వారు మీటర్లకు డీడీలు కడితే కరెంటు సరఫరా ఇస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపచేశారు.ఈ కార్యక్రమంలో నిదానం రాములు,ఎలమంద, వెంకన్న,సైదులు,రాజలింగం,చంద్రయ్య,ఉపేందర్,అండలమ్మ,ప్రమీల,లచ్చమ్మ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు…..